ఊర్వశి పురూరవుడి ప్రేమకథ మనకు మహాభారతంలో కనిపిస్తుంది. స్వర్గంలో ఉన్న ఊర్వశి భూలోకంలో ఉన్న పురూరవ మహారాజుతో ప్రేమలో పడింది. పురూరవుడూ తనను ప్రేమించాడు. ఓ సారి ఊర్వశి భూలోక విహారానికి వచ్చి తిరిగి వెళుతుండగా ఓ అసురుడు ఆమెను అపహరిస్తాడు. ఊర్వశి కేకలు వేస్తుండగా పురూరవుడు వచ్చి ఆమెను రక్షిస్తాడు. ఈ సమయంలోనే ఒకరినొకరు చూసుకుని ప్రేమలో పడతారు. స్వర్గంలో పురూరవుణ్ణే కలవరిస్తున్న ఊర్వశిని భరత మహర్షి భూలోకానికి వెళ్ళాల్సిందిగా శపిస్తాడు. శాప ఫలితంగా ఊర్వశి భూలోకానికి వస్తుంది. అప్పుడేమైంది? ఊర్వశి పురూరవుడు కలుసుకున్నారా? పెళ్ళి చేసుకున్నారా? ఆసక్తికర అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదనరావు మనతో ఉన్నారు.