Listen

Description

జీవితంలో మనము అనేక సుఖదుఃఖాలను అనుభవిస్తూ
ఉంటాము. కష్టాలను ఎదురుకున్నప్పుడు మనము నిరాశ చెంది కర్మలను త్యజించడం వైపు ఆకర్షితులవడం సహజం ఎందుకంటే మన కర్మలతో పాటు ఇతరుల కర్మలు మనకు సుఖాన్ని లేదా దుఃఖాన్ని కలిగిస్తాయనే భ్రమలో ఉంటాము. అర్జునుడు కూడా అదే సందిగ్ధావస్థ వలన యుద్ధం అనే కర్మను త్యజించాలనుకుంటున్నాడు.

"కర్మఫలమును     ఆశ్రయింపక కర్తవ్యకర్మను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కాని కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున సన్యాసి కాడు, యోగియు కాడు" అని శ్రీకృష్ణుడు స్పష్టం చేశారు (6.1).

కర్తవ్య కర్మ అంటే చేయదగిన కర్మ. దానిని గురించి ఎంత ఎక్కువ వివరణ ఇస్తే అది మరింత సందిగ్ధాన్ని కలిగించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది అనుభవాత్మకమైనది. ఈదడం నేర్చుకోవాలంటే నీటిలోకి దూకాలి. అదేవిధంగా, కర్తవ్య కర్మలను అర్థం చేసుకోవడానికి జీవిత అనుభవాలు మనకు సహాయ పడతాయి. ఇంద్రియాల సహాయం లేకుండా ఆనందంగా ఉండటమే ఈ మార్గములో మన పురోగతిని కొలవడానికి కొలమానం.

విత్తనం యొక్క టెంక యొక్క కర్తవ్య కర్మ ఏమిటంటే లోపల ఉన్న పిండాన్ని కాపాడాలి కానీ అనుకూల పరిస్థితులలో అంకురోత్పత్తికి (మొలకెత్తడానికి) దారి ఇవ్వాలి. ఇది మనకు సహజంగా కనిపించినప్పటికీ టెంక కోణం నుండి ఇది ఒక సందిగ్ధావస్థ ఎందుకంటే ఒకసారి రక్షించడం రెండో సారి దారి ఇవ్వడం దాని కర్తవ్య కర్మ. టెంక విషయంలో వలె గతం యొక్క భారం మరియు భవిష్యత్తు మీద ఆశ లేకుండా శక్తివంతమైన
వర్తమానం ద్వారా మనకు ఇవ్వబడిన కర్మను నిర్వహించడమే కర్తవ్య కర్మ.

రెండవది, కర్మను కాకుండా కర్మఫలాన్ని వదలిపెట్టినవాడే సన్యాసి అని శ్రీకృష్ణుడు చెప్పారు. పలాయనవాదాన్ని ఆశ్రయించకుండా మనలో ప్రతి ఒక్కరినీ సన్యాసిగా మారేందుకు ఈ బోధన సహాయం చేస్తుంది. పరిస్థితులు ఎటువంటివి ఐననూ మనము కర్మఫలాల ఆశను వదులుకున్న క్షణంలోనే సన్యాసి
యొక్క ఆనందాన్ని పొందుతాము.