Listen

Description

కదిలే బొమ్మలు చెప్పే ఎన్నో కథలు

కోలాహలం చేపిస్తాయి…. కన్నీళ్లు పెట్టిస్తాయి

కలహాలు పుట్టిస్తాయి…. హాయిని కలిగిస్తాయి

కడుపు పగిలేలా నవ్విస్తాయి

కడుపు మండేలా కోపం తెపిస్తాయి

ఎన్నో వైవిధ్య పాత్రలను తెర మీదకు ఎక్కిస్తాయి

తరతరాలు చూపిస్తాయి

నాటి సామ్రాజ్యాల నుండి నేటి సమాజం వరకు

కార్మికుడి నుండి నాయకుడి వరకు

అందరి కథలు ఉన్నాయి...అందని వ్యధలు ఉన్నాయి

భావాలని బందిస్తాయి

దెయ్యాన్ని అయిన దైవాన్ని మనతోనే ఉన్నట్టు చూపిస్తాయి

మనల్ని చూపే ప్రతిబింబాలు అవుతాయి

మనల్ని మార్చే గ్రంధాలయాలు అవుతాయి

ఉల్లాసానికైనా, విజ్ఞానానికైన

ఇది ఒక అంతులేని ప్రపంచం

నీవు ఒక కల్పితం కావొచ్చు కానీ కలలకు, కళలకు నువొక కల్పతరువువు సినీ అమ్మ.

Written by Bala Bhanu Prakash

Follow @ bhanu_5657

Narrated by Manoj

Follow @manojoriginal