#పెంకుటిల్లు
కొమ్మూరి వేణు గోపాలరావు
1935 లో జన్మించిన డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు సుప్రసిద్ధ తెలుగు రచయిత. బెంగాలు రచయిత శరత్ చంద్ర ప్రభావంతో తెలుగులో సుమారు 50 పైగా నవలలు వ్రాయటం వలన ఈయన "ఆంధ్రా శరత్"గా పిలువ బడ్డారు. ‘పెంకుటి’ల్లు నవల ఈయన పేరును చిరస్ధాయి చేసింది. ఇంటి పెద్ద, తన బాధ్యతను విస్మరిస్తే, ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో కళ్ళకు కడుతుంది ఈ నవల. అన్నింటికీ మించి, కాలంతో పాటు మారుతూ వచ్చిన మధ్యతరగతి విలువల పరిణామ క్రమానికి అక్షర రూపంగా పాఠక లోకంలో 'పెంకుటిల్లు’ స్థానం ఎన్నటికీ పదిలమే. ఓ నవల చదువుతున్నట్టుగా కాక ఒక డాక్యుమెంటరీ చూస్తున్నట్టుగా అనిపించే ఈ నవలను డా. కొమ్మూరి వేణుగోపాలరావు గారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ప్రప్రధమంగా శ్రవణ రూపంలో అందిస్తున్నది దాసుభాషితం.
---
#పెంకుటిల్లు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-penkutillu
–––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.