Listen

Description

#ఇల్లాలిముచ్చట్లు

పత్రికలలో కాలమ్స్ రాయాలంటే అపారమైన పాండిత్యం ఉండాలి. ప్రతిభ, పాండిత్యం, అభ్యాసం ఉన్న రచయితలలే ఈ కాలమ్స్ రాయగలరు. ఇలా సంవత్సరాల తరబడి కాలమ్స్ రాసిన వారు తెలుగులో చాలామందే ఉన్నారు. వారిలో ఒకరు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. వీరు ఎన్నో నవలలు, కథలు రాసినా వీరికి బాగా పేరు తెచ్చినది మాత్రం "ఇల్లాలిముచ్చట్లు". ఈయన రాసిన ఈ ఇల్లాలిముచ్చట్లు శీర్షికలు 30 సంవత్సరాల పాటు ప్రజాదరణ పొందాయి. వీరు కొత్త రచయితలను, రచనలను బాగా ప్రోత్సహించేవారు. స్త్రీ జీవితంలోని అసంతృప్తిని, స్త్రీ తన కుటుంబం నుంచి భర్త నుంచి ఏమి కోరుకుంటోంది అనే విషయాన్నీ, వంటింటి నుంచి అంతర్జాతీయ విషయాలపై కూడా మాట్లాడే ఒక సగటు ఇల్లాలి ముచ్చట్లపై విశ్లేషణను వినండి.

#ఇల్లాలిముచ్చట్లు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-illali-muchhatlu

Listen to a part of Chapter 1 of #Illalimuchhatlu. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.  

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

–––

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. 

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. 

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.