#యాత్రానుభవాలు
కొండూరు తులసిదాస్
2008 ప్రారంభంలో ఒక సుప్రభాత సమయాన, జీవితం ఏ ప్రత్యేకతా లేకుండా నిస్తేజంగా గడుస్తున్నట్టు తోచింది. ఏదైనా తీర్థ యాత్ర చేద్దామా అనిపించింది. నా ఆలోచనను శ్రీమతితో పంచుకోగా కాశీ వెళ్లి వద్దామని ప్రతిపాదించింది. ఆ విధంగా 2008 మార్చి నెలలో ద్వాదశ జ్యోతిర్లింగ ప్రధానంగా ప్రారంభమైన మా భారత దేశ తీర్థ యాత్రలు, ఇతర పుణ్య క్షేత్రాలూ, విహార స్థలాల దర్శనంగా 2015 సెప్టెంబరు వరకూ సాగింది. ఈ ఏడు సంవత్సరాల్లో ఒక్క ఈశాన్య రాష్ట్రాలూ, జమ్మూ కాశ్మీర్, గోవా తప్ప మిగతా దేశమంతా చుట్టివచ్చాము. ఆ యాత్రలలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు, సంతోషాలు, సంతృప్తులు, ఇక్కట్లు, ఇబ్బందులు, సమస్యలు. వాటన్నిటి అక్షర సమాహారమే ఈ భారతదేశ తీర్థ-విహార యాత్రలు, భావాలు, అనుభవాలు పుస్తకం.
#యాత్రానుభవాలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-yatranubhavalu-vihnukshetralu
–––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.