Listen

Description

#నారాయణరావు

లక్ష్మీసుందర ప్రసాదరావు విశ్వలాపురం జమీందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు చేసిన జమీందారీ వివాహం విఫలమై ఆమె పుట్టినింటికి తిరిగి రావటంతో, రెండవ కుమార్తె శారదకు జమీందారీ సంబంధం కాకుండా సాధారణ కుటుంబానికి చెందినవాడైనా యోగ్యుడు, విద్యావంతుడైన యువకుని కోసం అన్వేషిస్తూ ఉన్న సమయంలో నారాయణరావు నచ్చి, అతని తండ్రితో పెళ్లి ప్రతిపాదనలు చేస్తాడు. శారదకు ఈ సంబంధం సుతరామూ ఇష్టం లేదు. మరి ఆ సంసారం ఎలా సాగింది? ఆత్మగౌరవానికి విలువనిచ్చే నారాయణరావు పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు, చివరకు ఏమైంది? నవలకు రచయిత ఇచ్చిన అద్భుతమైన ముగింపులో తెలుసుకుంటాం. పదహారణాల తెలుగుతనం మూర్తీభవించిన బాపిరాజు, ఆయన వ్రాసిన ప్రతి నవలా, అది చారిత్రకమైనా, సాంఘికమైనా, దేనికదే సాటి. తన బహుముఖీన ప్రజ్ఞ ప్రతి నవలలోనూ ప్రదర్శించిన బాపిరాజు గొప్ప భావుకుడు. ముఖ్యంగా నారాయణరావు నవల, కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి వేయిపడగలు నవల సరసన నిలిచి ఆంధ్ర విశ్వకళా పరిషత్తు పురస్కారాన్ని పంచుకున్నది. అటువంటి నవలా రాజాన్ని శ్రవణరూపంలో అందిస్తున్నది దాసుభాషితం. వినండి నారాయణరావు శ్రవణ పుస్తకం, మొదటి సంపుటం. శ్రవణానువాదం గళం కొండూరు తులసీదాస్.

#నారాయణరావు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/ab-narayana-rao



Listen to a part of Chapter 1 of #NarayanaRao. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.



–––



ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.