Listen

Description

#మహాతలంమాయాదర్పణం

సుధామయి

చందమామ కథల్లోలాగా ఒక రాజు, ఒకరాణి , మాంత్రికుడు అతని ప్రాణాలు ఇలానే సాగే ఈ కథలో ఒక దర్పణం (అద్దం) కోసం ఈ కథ సాగుతుంది. పట్టాభిషేకం జరిగే ముందు దేశ సంచారం చేద్దామని, ప్రపంచాన్ని తెలుసుకుందామని తిరుగుతున్న శూరుడైన చంద్రశేనుడికి ఒక శివాలయం వద్ద ఒక అద్దం కనిపించింది. అది విచిత్రంగా తనలోకి అన్నింటిని లాగేసుకుంటుంది. ఇలా ఎందుకు జరుగుతోందో ఆ అద్దం యొక్క విషయం కనుక్కుందాం అనుకుంటున్న అతనికి మాంత్రికుడు మారు వేషంలో వచ్చి, దాని గురించి చెప్పి మరో ప్రపంచం (మహాతలం) కు పంపిస్తాడు. దర్పణం యొక్క గొప్పతనం, మాంత్రికుడికి వచ్చే లాభం, మహాతలం అందాలు, అద్దం వల్ల చంద్రశేనునికి జరిగిన ప్రయోజనం ఏమిటో వినండి.

---

#మహాతలంమాయాదర్పణం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.   www.dasubhashitam.com/ab-title/ab-mahaatalam-maayaadarpanam

--- 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

--- 

ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.