#షేక్స్ పియర్ - విషాదం
షేక్స్ పియర్ ను ఇంగ్లీష్ భాషలోనే శ్రేష్టుడిగా చెబుతారు. సాహిత్యంలో హాస్యానికి, విషాదానికి విడివిడిగా స్థానాన్ని చూపించారు ఈయన. సాహిత్య ఆరాధకులందరికి ఆరాధ్యుడు. సాహిత్యంలో విషాదానికి ఒక ఘాడతను, గొప్ప ఆకర్షణను, సౌందర్యాన్ని తీసుకువచ్చారు. షేక్స్ పియర్ నాటకాలు దృశ్య కావ్యాలకు, దృశ్య సాధనాలకు ముడిసరుకును అందించాయి. వీరు రాసిన నాటకాలు విషాదాంతాలు అయినా గొప్పగా ప్రజాదరణ పొందాయి. వీటిలో కొన్ని ప్రేమకు, మృత్యువుకు, విధికి ఉన్న సంబంధాన్ని వ్యాఖ్యానించిన గొప్ప కావ్యం రోమియో-జూలియట్. విధికంటే మనస్తత్వాలే విషాదానికి కారణాలుగా చూపిన నాటకం కింగ్ లియర్. దీన్ని సవరించి సుఖదాంతం చేసి మళ్ళీ కొన్ని ఏళ్ళ తరవాత యధాతథంగా ప్రదర్శించారు. ఈర్ష్యనే ప్రధానాంశంగా చూపి విషాదాంతంగా మలచిన మరో నాటకం ఒథిల్లొ. దీన్ని ఎన్నో మాధ్యమాల్లో దృశ్య కావ్యంగా కూడా తీశారు. వీటి గురించి మరింత వివరణని మృణలినిగారి విశ్లేషణలో వినండి.
–
#షేక్స్ పియర్ - విషాదం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-shakspear-tragedy
Listen to a part of Chapter 1 of #ShakespeareTragedy. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.