Listen

Description

#షావుకారు జానకి

అందం,ఒడ్డూ, పొడుగూ,మంచి ఆహార్యం వంటివి సినిమాలకు కావలసిన లక్షణాలు. ఇవేవి లేక పోయినా, చేసినవి కొన్ని పాత్రలే అయినా, తన వాక్పటిమతో ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్న నటి "షావుకారు"జానకి. తన మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంతగా ఆమె షావుకారు లో అభినయించారు. మంచి సంప్రదాయంలో పుట్టి పెరిగిన ఆమె, సినీ రంగంపై చాలా చిన్న చూపు ఉన్న ఆకాలంలో సినిమాల్లో ఎందుకు చేరారు? మిగతా నటులతో జానకి గారి కున్న సంబంధాలు ఎలా ఉండేవి, అప్పటి వాళ్ళ కష్టాలు, ఆమె వేసిన పాత్రల గురించి, ఆ తరానికి ఈ తరానికి ఉన్న వ్యత్యాసం, జీవితంపై, ప్రేమపై ఆవిడ నిర్వచనం, తాను పనికి రాదు అన్న చోటే తనను నటిగా నిలబెట్టుకోడానికి ఆమె పడిన కష్టం, ఇంకా మరెన్నో విషయాల గురించి మృణాళిని గారి ముఖాముఖీలో వినండి.

#షావుకారు జానకి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-shavukaru-janaki



Listen to a part of Chapter 1 of #ShavukaruJanaki. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.



–––



ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.