Listen

Description

#వెలుగు వెన్నెల హారతి

“నేను వ్రాసే వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో చిన్న చిన్న కథలు, ఉదాహరణలు ఇస్తూ వచ్చాను. అయితే ఇటువంటి పెర్సొనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు పిల్లలు చదవరు. కానీ కథలు పిల్లలకు ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ ఇస్తాయి. అలాంటి కథలన్నీ క్రోడీకరించి ఒక చోట చేరిస్తే వాటిని పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఒక పుస్తకం రాశాను దాని పేరు వెలుగు వెన్నెల హారతి. అదే ఇప్పుడు మీకు శ్రవణ రూపంలో ప్రెజెంట్ చేస్తున్నాను. నా వివిధ వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లోనుంచి ఏరి కూర్చిన కథల సమాహారం ఇది. ఇందులో కొన్ని కథలు విదేశాలకు సంబంధించిన పురాతన గాధలు మరికొన్ని, బౌద్ధానికి జైనానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. కొన్ని ఇంటర్నెట్ నుంచి స్వీకరించినవి, కానీ చాలావరకు నావి. పెద్దలు పిల్లలకి బెడ్ రూమ్ కథలు చెప్పటం తగ్గిపోయింది. 'అసలు మాకు తెలుస్తే కదా చెప్పటానికి’ అంటున్నారు కొందరు. ఈ శ్రవణ పుస్తకం ఆ లోటు తీరుస్తుందని ఆశిస్తున్నాను. మీరు వినండి. వీలైతే పిల్లలకు చెప్పండి, లేదా వారికి వినిపించండి." - మీ యండమూరి వీరేంద్రనాథ్

#వెలుగు వెన్నెల హారతి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/ab-velugu-vennela-harathi



Listen to a part of Chapter 1 of #VeluguVennelaHarathi. Download the App via the link above to listen to the full title.

––

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.



–––



ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.