ఒకప్పుడు ఆకలితో పస్తులు ఉన్నాడు.. ఇప్పుడు కొన్ని వేల మంది ఆకలి తీరుస్తున్నాడు!
చిన్నతనంలో ఆకలితో ఇబ్బందులు పడిన ఓ వ్యక్తి.. తాను ఎదుర్కొన్న కష్టాన్ని మరొకరు ఎదుర్కోకూడదని ఆలోచించాడు. ఆ ఆలోచనే ఇప్పుడు రోజుకు 2,000 మందికి పైగా ఆకలి తీర్చే ప్రయత్నంగా మారింది. ఆయనే Don’t Waste Food ఫౌండేషన్ వ్యవస్థాపకులు మల్లేశ్వరరావు గారు!
పెళ్లిళ్లు, పార్టీలు, ఇతర వేడుకల్లో చాలాసార్లు తినడానికి మిగిలిపోయిన ఆహారం వృధా అవుతుంటుంది. అదే సమయంలో ఎంతోమంది పూట గడవడానికి కూడా ఇబ్బందులు పడుతుంటారు. ఈ రెండు పరిస్థితులను గమనించిన మల్లేశ్వరరావు గారు.. వృధా అవుతున్న ఆహారాన్ని ఆకలితో ఉన్నవారికి అందించాలని నిర్ణయించుకున్నారు.
అలా.. వివిధ వేడుకల్లో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి, అవసరమైన వారికి అందిస్తున్నారు. ఒకవైపు ఆహారం వృధా కాకుండా చూస్తూనే, మరోవైపు ఆకలితో ఉన్నవారి కడుపు నింపుతున్నారు. తన చిన్నతనంలో ఎదుర్కొన్న ఆకలి కష్టాన్ని ఇతరుల ఆకలి తీర్చే సంకల్పంగా మార్చుకున్నారు.
మరి అసలు మల్లేశ్వరరావు గారి ప్రయాణం ఎలా మొదలైంది? రోజుకు వేలమందికి ఆహారం అందించే ఈ ప్రయత్నం వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? ఈ పాడ్కాస్ట్ లో మీకోసం!
Once he struggled with hunger, but today, he is helping thousands of people overcome it!
Having experienced hunger during his childhood, Malleshwara Rao, founder of the Don’t Waste Food Foundation, decided that no one else should have to endure the same hardship. What began as a thought has now grown into an initiative that strives to feed over 2,000 people every day.
By collecting surplus food from weddings, parties, and other events, his foundation ensures that food reaches people in need instead of going to waste. His journey is a powerful example of how personal struggles can inspire meaningful social change.
How did Malleshwara Rao begin this journey? What inspired him to turn his childhood struggles into a mission to fight hunger? Discover the inspiring story behind his initiative in this podcast!
Guest : Malleshwar Rao Nemani,
Founder,
Don't Waste Food
Host: Bharath
#TALRadioTelugu #DontWasteFood #FightHunger #FoodForAll #SocialImpact #InspiringStories #TouchALife #TALRadio