Listen

Description

ఆహారం గురించి ఎప్పుడూ లేనంత ఆసక్తి ఇప్పుడు కనిపిస్తోంది. ఎవరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు ఎలాంటి పోషకాలు ఉండి తీరాలి, మన శరీరం మీద ఏ ఆహారం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది లాంటి సవాలక్ష విషయాల మీద మనకు లెక్కలేనంత సమాచారం లభిస్తోంది. వీటి నుంచి ఎంత ఉపయోగం ఉందో... అంత అయోమయం కూడా కలుగుతోంది. అందుకే టాల్‌ పరిపూర్ణమైన ఆరోగ్యం కోసం ఎవరు, ఎప్పుడు, ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయం మీద ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రిత విస్సాప్రగడ గారితో వారం వారం వినూత్నమైన శీర్షిక నిర్వహిస్తోంది. ఈ సిరీస్‌ ఇప్పుడు 25వ మైలురాయిని చేరుకోవడం దాని ఆదరణకు నిదర్శనం.

దృఢమైన శరీరాకృతి కావాలన్నది ఎంతోమంది కల. దీని కోసం తగిన వ్యాయమం, శిక్షణ తీసుకుంటారు కూడా. మరి ఆహారం సంగతి ఏమిటి? ప్రొటీన్లు తీసుకోవాలా, ఏఏ విటమిన్లు ఉండే ఆహారం కావాలి? ఇలాంటి ఎన్నో వివరాల సమాహారం ఈ వారం ఎపిసోడ్‌.

Host: Jayasree

Expert: Asritha Vissapragada

Nutritionist Asritha Contact Details: trulynutrition2015@gmail.com

#talradiotelugu #KnowYourPlate #BodyBuilder #HealthyFood #vitaminsupplements #asrithavissapragada #jayasree #touchalife #talradio