Listen

Description

సమస్య ఉన్న చోట పరిష్కారం కూడా తప్పక ఉంటుంది అంటూ పని చేస్తుంది… SJ Foundation!

హైదరాబాద్‌కు చెందిన SJ Foundation విద్య, మహిళల అభివృద్ధి, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ వంటి ఎన్నో రంగాల్లో పనిచేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం, ఆట స్ధలాలు ఏర్పాటు చేయడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు చేయడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒక ప్రాంతంలో ఏ అవసరం ఉందో గుర్తించి, దానికి తగిన పరిష్కారం చూపించేలా స్థానిక ప్రజలు, పాఠశాలలతో కలిసి పనిచేస్తోంది.

మరి అసలు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? పర్యావరణం, ఆరోగ్యం, నీటి సంరక్షణ కోసం SJ Foundation చేస్తున్న ప్రయత్నాలేమిటి? సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఈ సంస్థను ఎలా ప్రారంభించారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను SJ Foundation CEO సుమలత గారు, డైరెక్టర్ చేతిన్ గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.

SJ Foundation, based in Hyderabad, believes that every problem has a solution. Working across education, women’s empowerment, healthcare, environmental protection, and water conservation, the foundation creates meaningful change through community-focused initiatives. From setting up computer labs and playgrounds in government schools to creating employment opportunities for women and conducting health camps, SJ Foundation works closely with local communities to address their needs. In this podcast, CEO Sumalatha and Director Chetin share the foundation’s journey, initiatives, challenges, and vision for building a better society.

Guests: Suma Latha S

CEO

Jatin Balavari

Director

Host: Adarsh Kumar

#TALRadioTelugu #SJFoundation #SocialImpact #WomenEmpowerment #EducationForAll #CommunityDevelopment #TouchALife #TALRadio