Kathalu Kaburlu S03E04నాకు చిన్నప్పుడు బాగా ఇష్టమైన సినిమాల్లో ఒకటి 'గుండమ్మ కథ'. పంట్లాగూలు వేసుకుని, అచ్చమైన కృష్ణ యాసలో గుండక్కా.. అంటూ సరదాగా ఉండే ఎన్.టి.రామారావు, 'అలా కాదు ప్రియమైన నాన్నగారూ అనాలి' అంటూ మంచితనానికి చీరకట్టినట్టు ఉండే సావిత్రి, సగం నవ్వు, సగం చూపులతోనే నటించేసే నాగేశ్వరరావు, 'అమ్మా.. కాఫీ' అంటూ గారాలు పోయే జమున, 'పేడకళ్ళు ఎత్తుకునేవాడివి నీకెందుకోయ్ కోటు..' అంటూ 'పాలు మోసుకునేవాడివి నీకెందుకోయ్ కోటు..' అనిపించుకునే రమణారెడ్డి, 'ఎవడి బాబుగాడి సొమ్మని తింటున్నావే' అనే సూర్యకాంతం, 'నా బాబుగాడి సొమ్మనే తింటున్నానే' అనే ఛాయాదేవి. వీళ్ళంతా ఓ మూడు గంటలు నన్ను mesmarise చేసేసేవారు.కానీ కాస్త ఊహ పెద్దది అయ్యాకా, నాగేశ్వరరావు-జమునల relationship చాలా తప్పు అనిపించింది. ముఖ్యంగా 'మీ కాళ్ళ దగ్గర పాడేస్తాను నాన్నా' అనే నాగేశ్వరరావును, గర్వంగా నవ్వుకునే ఎస్వీఅర్ ను చూస్తే నాకు కోపం వచ్చింది. ఆమె గారాభంగా పెరిగి, కాస్త అహంకారంగా ఉన్నంత మాత్రాన అన్ని ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఏముంది అనిపించింది. అసలు పెళ్ళి పట్ల వాళ్ళ approachలోనే చాలా సమస్య ఉన్నట్టు అనిపించింది నాకు. కానీ గుండమ్మ కథ సినిమా అంటే ఇష్టం అలాగే ఉంది. మిస్సమ్మ లాంటి progressive సినిమా వచ్చిన 8 ఏళ్ళ తరువాత ఈ సినిమా రావడం ఒక విశేషం.చాలామంది సినిమాని సినిమాలా చూడాలి అంటారు. కానీ అది ఎప్పటికీ జరగని పని. అలనాటి గుండమ్మ కథ నుండి నేటి యానిమల్ వరకూ ప్రతీ సినిమా అందరిపైనా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది అనేది నిజం. ప్రధాన మీడియా అయిన సినిమాల్లో రక్తపాతం, హింస, వ్యక్తిగత దూషణ, బూతులు, ముఖ్యంగా స్త్రీల పట్ల చిన్నచూపు, వారిపై హింసను normalize చేయడం చాలా చాలా చాలా ప్రమాదకరం.5ఏళ్ళ పిల్లవాడి దగ్గర నుండి సినిమాలు అన్ని వయసుల వారు, అన్ని రకాల ప్రవృత్తుల వారు, అన్ని రకాల ఆలోచనా ధోరణి కలవారూ చూస్తారు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా రచయితలు, దర్శకులు ఉండాలి? చాలా సినిమాల్లో అన్ని స్త్రీ పాత్రలూ, పురుషులతో simpleగా replace చేసినా కథ నడిచిపోయే విధంగా design చేయబడి ఉంటాయి. ఏదో వైవిధ్యం కోసం, ఆడవాళ్ళు సినిమాలో ఉండాలి కాబట్టీ స్త్రీ పాత్రలను సృష్టించే వారు కొందరు అయితే, హీరో చేసే ప్రతీ పనీ హీరోయిజంగా, ఆడవాళ్ళు అందరూ అయితే తింగరి వాళ్ళు, లేకపోతే పొగరుబోతులు అన్నట్టుగా చూపించేవాళ్ళు మరికొందరు.ఈ విషయంపైనే మార్చి నెల మొదటి శనివారం ప్రసంగం జరిగింది. ఈనాటి సమాజంలో ఫెమినిజం, సినిమాల్లో స్త్రీల స్థానం వంటి విషయాలపై మాట్లాడారు ప్రముఖ instagrammer మౌనిక జగ్గాల.
---
ఇదే పాడ్కాస్ట్ మీరు యాప్ లో కూడా వినవచ్చు. బ్లాగ్ లో కూడా చదవచ్చు. ఇవే లింకులు.
Podcast: https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3
Blogpost: https://www.dasubhashitam.com/blog/feminism-aaj-kal