Kathalu. Kaburlu. S02 Chapter 24.
శ్రీరమణ గారి మరణవార్త విన్నాకా, ‘బంగారం హరించుకుపోయింది, మనం మిగిలాం’ అనిపించింది. ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత శ్రీ అన్వర్ గారు తన పోస్ట్ లో పాత్రికేయినిగా చేస్తున్నప్పుడు నండూరి, పురాణం, తరువాత బాపు-రమణ వంటి సాహితీ సింహాల మధ్య తన అనుభవాలను ‘సింహాల మధ్య నేను’ అని శ్రీరమణ గారు ఒక పుస్తకం రాయాలని ఉందన్నారని చెప్పినప్పుడు ఒక మంచి పుస్తకం మిస్ అయ్యామన్న వేదన కలిగింది. ఇక ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు శ్రీమతి వి.బి.సౌమ్య గారు ఫేస్ బుక్ లో శ్రీరమణ గారి వ్యాసాలు రెండిటిని పోస్ట్ చేసి, వాటితో పాటు ‘హర్షణీయం’ వారితో శ్రీరమణ గారి ఇంటర్వ్యూ లింక్ ఇచ్చారు. అది విని, ఆయన వాక్ప్రవాహంలో గట్టి మునకలు వేసి ఆనందించాను. వారి నిష్క్రమణ బాధ నుండి కాస్త ఉపశమనం దొరికింది. ఇక మరో కోరా రచయిత శ్రీ నళనీకాన్త్ వల్లభజోస్యుల గారు ‘ఈ బంగారం ఎప్పటికీ హరించదు, ఎందుకంటే ఇది మన ఉనికి’ అన్నారు. అది చదివాకా, ఆ ఇంటర్వ్యూ విన్నాకా, నిజమే ఆయన ఎక్కడికీ పోలేదు. మనందరి నవ్వులో శ్రీరమణున్నాడురా అనిపిస్తోంది.
---
మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2