Kathalu. Kaburlu. S02 Chapter 26.
జరగకముందు నాకు చాలా టెన్షన్, జరిగాకా బొలెడంత తృప్తి-ధైర్యం ఇచ్చిన కార్యక్రమం ఈ నెల ప్రసంగాలు కార్యక్రమం. నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన ఈ పుస్తకాన్ని celebrate చేయడం, ఎందరో ప్రముఖులు, మొట్టమొదటిసారి క్విజ్ ఇలా ఒక్కో అంశం నాలో కంగారు పెంచుతూ పోయాయి. చిన్నప్పటి నుండి మా నాన్నగారు సభలు, కార్యక్రమాలు నిర్వహించడం చూస్తు పెరిగిన నాకు, ఆయనలా మాట్లాడగలగాలి అనేది ఒక bench mark.
ఆయన అంతగా కాకపోయినా, ఫరవాలేదు వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది అని అనిపించుకోవాలని ఆశ. ఏదైనా కార్యక్రమం నిర్వహించే ముందు ఒక్కటే అనిపిస్తుంటుంది, మా నాన్నగారు నిర్వహించిన సభలు చూసినవారు, ఈ కార్యక్రమానికి వచ్చి 'పండిత పుత్రః పరమ శుంఠః' అనుకోకపోతే చాలు. ఈ కార్యక్రమం చూసి, మా నాన్నగారే స్వయంగా ఫోన్ చేసి 'బాగా చేశావు చిన్నీ' అనిపించుకోగలిగాను. హమ్మయ్య అనిపించింది. ఈ కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి journey అంతా ఈ వారం కథలు కబుర్లలో వినండి.
----
మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2