Kathalu. Kaburlu. S02 Chapter 28.
ఒక రెండో మూడో పాత్రలు తీసుకుని వాటి మధ్య ఒక కథ గాని, నవరసాలు పలికేట్టు ఒక నవల గానీ రాయాలంటే ఎంతో తీరిక కావాలి. రచయితకు తనలోని కలిగే అందమైన భావాలను కలంతో కాగితం పై పెట్టే వాతావరణం కూడా కావాలి. మరి 300 పేజీలకు సరపడే విషయాన్ని 3 లేక 4 వాక్యాలలో రాయాలంటే, ఇంకా ఎంతో కష్ట పడాలి. ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నా సామాన్యుడికి తెలియజేసేది పత్రిక. ఈ పత్రికలో, ఎందరో ప్రముఖుల జీవితాలలో మనకు తెలియని సంగతులను కాలమ్స్ గా రాసిన రచయిత శ్రీరమణ గారు. వారు రాసిన కొన్ని కాలమ్స్ ఈ "మొగలిరేకులు"లో వినండి.
---
మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2