Kathalu. Kaburlu. S02 Chapter 29.
అడిగెదనని కడువడిఁ జను.
అడిగినదన మగుడ నుడువడని నడయుడుగున్,
వెడవెడ జిడిముడిఁ దడబడ,
నడుగిడు.నడుగిడదు. జడిమ నడుగిడు నెడలన్.
చదవడానికి బాగా ఇబ్బందిగా ఉంది కదా!
మన తాతల, తండ్రుల కాలంలో ఇలాంటి పద్యాలని పాఠ్యపుస్తకంలో లెసన్స్ గా పెట్టి చదివించేవారు. దాని వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాక , నోరు బాగా తిరిగేది. అందుకే వాళ్ళు భారత, భాగవత మూలాలని పద్య రూపంలో చదవగలిగేవారు. ఇప్పుడు చాలా స్కూల్స్ లో తెలుగు మాధ్యమంలో చెప్పడం మానేశారు. తెలుగు అనే ఒక సబ్జెక్ట్ ఉందని రాను రానూ చాలా మందికి తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో!
మన భావాల్ని ఎంతో అందమైన పదాలతో, సొంపుగా మంచి సొబగులతో చెప్పాలంటే అది మాతృభాషలోనే సాధ్యం. పైన చెప్పిన పద్యం పోతన భాగవతంలోని "గజేంద్రమోక్షం" లోనిది.
ఈ పద్యం మొత్తంలో డ, న,గ ఈ అక్షరాలే ఎక్కువగా వాడినా, వాటి మధ్య ఉన్న పద విరుపు వల్ల దాని అర్ధంలో ఎంతో మార్పు వస్తుంది. బహుశా ఈ అందం తెలుగుకే సొంతం అనుకుంట. అంతటి అందమైన ఘనమైన తెలుగు గురించి ఈనాటి కథలు కబుర్లలో విందామా!
---
మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2