Listen

Description

Kathalu Kaburlu S03E02

'ఫిదా' సినిమాలో 'హేయ్ పిల్లగాడా' పాట మొదటిసారి విన్నప్పుడు భలే తమాషాగా అనిపించింది నాకు. ఆ పాటలో వచ్చే Interlude 'మల్లీశ్వరి' సినిమాలోని 'పరుగులు తీయాలి' పాటలోనిదే. అసలే మల్లీశ్వరి సినిమా పాటల పిచ్చిదాన్ని నేను. ఇక ఈ పాట కూడా నా faviourates లోకి చేరిపోయింది. ఆ పాటను అలా ఉపయోగించుకోవడం శేఖర్ కమ్ముల సాలూరి వారికి ఇచ్చిన tributeలాగా అనిపించింది. అంతకుముందు 'ఆనంద్' సినిమాలో కూడా 'మనసున మల్లెల మాలలూగెనే' పాట చూపిస్తారు శేఖర్. ఈ రెండిటిని బట్టీ ఆయనది కూడా నాలాగే గొప్ప taste అని certify చేసేశా.పరుగులు తీయాలి పాటలో వేరే ఊరి నుంచి ఎడ్లబండిపై తమ ఊరు వెళ్తుంటారు హీరో, హీరోయిన్లు. మబ్బులతో పందెం వేస్తూ, ఎవరు ముందు చేరతారో అన్నట్టుగా పోటీ పడుతున్నట్టు వెళ్తుంటారు. ఆ ఎడ్ల గిట్టల చప్పుడు, మెళ్ళో ఉండే గంటల శబ్ధం పాటంతా సాగుతూ అద్భుతమైన సహజ సంగీతం సమకూరినట్టుగా పాటని నిర్మించారు సాలూరి వారు. అదే సినిమాలో మరో పాట 'కోతీ బావకు పెళ్ళంటా, కోవెల తోట విడిదంట' పాటలో కూడా ఇలాంటిదే మరో సరదా పనిచేశారు.నాగరాజు ఉలితో శిల్పాలు చెక్కుకుంటూ ఉంటే, 'నువ్వే కోతివి' అంటూ అన్యాపదేశంగా పాట పాడుతూ ఉంటుంది మల్లీశ్వరి. ఈ చిలిపి పాటలో ఆద్యంతం నాగరాజు ఉలి శబ్ధాలు సహజంగా అమరిన సంగీతంలా ఉంచారు. సన్నివేశానికి, పాటని ముడివేయడంలో అక్కడ లేని వాద్యాల కంటే, ఇలాంటి చిన్న వస్తువులతో సంగీతం రప్పించడం, వాళ్ళు ఈ శబ్ధాలను సంగీతంగా చేసుకుని నిజంగానే పాట పాడుకుంటున్నారు అని మనకి అనిపించేలా చేయడం ఎంత తెలివైన, సృజనాత్మకమైన పని.సాలూరి వారి శిష్యులంతటివారు ఎంతో చెప్పిన తరువాత, సంగీతంలో ఓనమాలు రాని నాబోటి అమ్మాయి చెప్పేది ఏముంటుంది. ప్రసంగం విన్నవాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారో, నేను ప్రత్యక్షంగా చూశాను. చూడనివారి కోసం యూట్యూబ్ లో ఈవారంలోనే పెట్టేస్తాం. చూసేయండి. ఈలోపు ఈ వారపు న్యూస్ లెటర్ చదివి, కథలు-కబుర్లు వినేయండి. ఇవిగో లింకులు.

Podcast : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3

Blog: https://www.dasubhashitam.com/blog/saluri-variki-kopamosthe