Kathalu. Kaburlu. S02 Chapter 30.
ఇంగ్లీషు కామెడీ సిట్కాం అయిన The Big Bang Theory లో ఒక పాట ఉంటుంది. ఆ పాటలో ప్రతి చరణం విశ్వం పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్పి It all started with the big bang అని ముగుస్తుంది. ఆ పాట సారాంశం ఇలా ఉంటుంది:
గణితమూ, సైన్సూ, చరిత్ర అన్నీ కలిసి ఎన్నో మిస్టరీలను ఛేదించడం మొదలు పెట్టాయంటే అసలు అదంతా మొదలయ్యింది ఈ మహా విస్ఫోటనం వలనే. మతాల నుంచి ఖగోళ శాస్త్రం వరకు, ఐన్స్టైన్ నుంచి జ్యోతిష్య శాస్త్రం వరకూ, పిరమిడ్స్ ని నిర్మించడం నుంచి చైనా గోడని కట్టడం వరకూ వచ్చినవన్ని జరిగినవన్నీ సృష్టికి ముందు జరిగిన ఆ మహా విస్ఫోటనం వలనే. అసలు చరిత్రలో మొదలయిన ప్రతీ విషయానికి కారణం సృష్టికి ముందు జరిగిన ఆ మహా విస్ఫోటనమే.
ఇలా విశ్వంలో జరిగిన ప్రతి వి’చిత్రానికి కారణం మహావిస్పోటనమే అని విచిత్రంగా తేల్చి చెప్పేస్తుంది ఆ పాట.
ఇలా ప్రపంచ చరిత్ర అంతా రూపు దిద్దుకోడానికి ఎప్పుడో జరిగిన మహావిస్పోటనం కారణం అయినట్లు, తెలుగు సినిమా చరిత్ర అంతా రూపు దిద్దుకోడానికి ఏవేవి కారణం అయ్యాయో ఈ నెల జరిగిన తెలుగోళ్ళు. సినిమాలు. ఒక చరిత్ర. ప్రసంగం చూస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన కారణాలు తెలుస్తాయి.
ఈ నెల ప్రసంగంలో నాకు బాగా నచ్చిన పాయింట్లు.
• రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం గురించి వినడమే గాని, ఆయన గురించి అసలు తెలియని నాకు ఆయన చేసిన కృషి ఏంటో ఈ ప్రసంగం ద్వారా తెలిసింది. 1920లో ఊరూర తిరిగి సినిమాలు ప్రదర్శించడమే కాక, ఆ సినిమాల కోసం పెట్టిన ఖర్చు, సినిమాల్లో మంచి భవిష్యత్ ఉందని ఊహించి కుమారుడు RS. ప్రకాష్ ను యూరప్ దేశాలు పంపి మరి సినిమా గురించి నేర్చుకు రమ్మనడం.
• 1929లో ఎక్కడో స్టాక్ మార్కెట్ కూలిపోయి అక్కినేనీ నాగేశ్వర రావుని సినిమాల్లోకి పంపడం.
• నా చిన్నప్పుడు 8వ తరగతి జీవశాస్త్రం పాఠ్యాంశంలోని హరిత విప్లవం, కొందరు వ్యక్తులను సినిమాల్లోకి పంపి సినిమా స్టార్లుగా ఎదగడానికి కారణం అవడం.
• దర్శకులు 3, 4 గంటలు సినిమా తీసినా ఆ సినిమా ఎడిటింగ్ వారి బుర్రలోనే ఎలా జరిగిపోయేదో అన్న ఒక ఫన్నీ ఉదాహరణ.
• పాత సినిమాల్లో పున్నమి వెన్నెలలో ఉండే రొమాంటిక్ పాటలు అన్ని అసలు ఎర్రటి ఎండలో షూట్ చేశారని.
ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర తెలుగు సినీ చరిత్ర విశేషాలు ఈ ప్రసంగంలో చూడండి : https://youtu.be/9EmaMsN6IJE
---
మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2