Listen

Description

Kathalu. Kaburlu. S02 Chapter 31.

నేను మే 2021లో దాసుభాషితం టీంలో చేరాను. మొదటి మీటింగ్ లో టీం పరిచయం జరిగింది. రెండో మీటింగ్ లో కిరణ్ గారు చాలా excited గా ఒక presentation ఇచ్చారు నాకు. తాను కలలు కంటున్న smooth experienced app demonstration అది. ఆ యాప్ layout పూర్తిచేసుకుని, developers దగ్గర ఉందని, అందులో content కి సంబంధించిన కొత్త tabs రూపొందించమని నాకు చెప్పారు.

యాప్ విడుదల పనులు ఆలస్యమయ్యే కొద్దీ మా టీంలో ఉత్సాహం తగ్గకుండా కిరణ్ గారు ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. కొన్నాళ్ళకి ఆయనకే సహనం తగ్గే స్థితి ఏర్పడింది. కానీ ఆ స్థితిని కూడా అధిగమించారు. కలలో కూడా ఊహించడానికి ఇష్టపడని ఒక సంఘటన అప్పుడే జరిగింది.

కొత్త యాప్ విడుదల మాట దేవుడెరుగు, ఉన్న యాప్ లో security ని develepors team గాలికి వదిలేయడం వలన, యాప్ hack అయింది. దాదాపు 3 నెలలు గాఢాంధకారం. కొత్త విడుదలలు లేవు, కొత్త పుస్తకాల గురించి రచయితలతో మాటలు లేవు, వారం వారం రాసే న్యూస్ లెటర్ లేదు, నెల తిరిగే సరికల్లా బిళ్ళబెత్తుల్లా జీతం రాళ్ళు మాత్రం బ్యాంక్ లో హాజరు.

నిజానికి చాలా సిగ్గుగా అనిపించేది ఆ డబ్బులు ముట్టుకోవాలంటే. ఏం పని చేస్తున్నాం కనక జీతం తీసుకోవడం అనిపించేది. అయ్యో ఎన్నో లక్ష్యాలతో మొదలుపెట్టిన ఉద్యోగం ఇక ఇంతేనా అనే నైరాశ్యం. అప్పుడే లాక్ డౌన్ నుంచి బయటకు వచ్చి, యాప్ లాక్ డౌన్ లో ఇరుక్కున feeling.

అలాంటి సమయంలో కిరణ్ గారి నుండి ఫోన్. 'మీనా, విడుదలలు లేకపోతే మాత్రం ఏమిటి? ఏదో ఒక న్యూస్ లెటర్ రాయి, నీకు ఇష్టం వచ్చిన విషయంపై రాయి. నీ writing skills ని improve చేసుకో. ఎలాగూ ప్రతీవారం audio content ఇవ్వలేకపోతున్నాం కదా శ్రోతలకి, ఒక మంచి సాహిత్య వ్యాసం ఇద్దాం' అన్నారు. మరలా ఒక ఉత్సాహం. నాకిష్టమైన విషయంపై వారానికో వ్యాసం.

ఈలోపు మన యాప్ సంగతి మీ అందరితోనూ పంచుకున్నారు కిరణ్ గారు. ఆ సమయంలో మీ అందరి నుండి వచ్చిన స్పందన అనూహ్యం. మీ వెంట మేము ఉంటాం. మీపై మాకు నమ్మకం ఉంది అంటూ ఎందరో మమ్మల్ని అర్ధం చేసుకుంటూ రాసిన మెయిల్స్ వర్షంలో ఆనందంగా తడిసిపోయాం. మీ యాప్ ను కాపాడడానికి మేము help చేస్తాం అంటూ ముందుకు వచ్చినవారూ ఉన్నారు. అలాంటి నిస్సాహాయ స్థితి నుండి నేడు android test version విడుదల చేసే స్థితికి చేరామంటే, మా టీం వెనుక ఎందరో subscribers ఉన్నారు.

ఇప్పటికే చాలామంది సర్వజ్ఞ సభ్యులు ఈ testing లో పాల్గొని, విలువైన సలహాలు అందిస్తున్నారు. న్యూస్ లెటర్ లో చెప్పినట్టు మీ అందరికీ ధన్యవాదాలు యాప్ తో చెప్పాలని నిరంతరమూ కృషి చేస్తున్నాం.

ఈ వారం న్యూస్ లెటర్ ని ఇక్కడ చదవండి.
https://www.dasubhashitam.com/blog/ennallo-vechina-udayam

కథలు కబుర్ల శ్రవణ రూపంలో యాప్ లో ఇక్కడ వినండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2