kathalu Kaburlu S02E32
శ్రీదేవి గారు రాసిన కాలాతీత వ్యక్తులు నవల చదివిన తరువాత మార్గరెట్ మిచెల్ రాసిన Gone with the wind చదివినప్పుడు ఇందిర పాత్రలోని కొన్ని లక్షణాలు scarlet నుండి inspire అయి ఉండవచ్చు అనిపించింది. ఆ నవల చదివిన కొత్తల్లో చాన్నాళ్ళు నా చుట్టూ ఉండేవారిలో ఇందర, ఇతర పాత్రల లక్షణాలు పోల్చుకోవడం ఒక హాబీగా మారింది. అలాంటి bold పాత్రను సృష్టించిన శ్రీదేవి గారు, తన ఉరుములు - మెరుపులు కథలో సుధ లాంటి self pity కలిగిన పాత్రను సృష్టించారు అంటే ఆశ్చర్యం కలిగింది.
నిజానికి మనం ఇష్టపడే వ్యక్తిత్వమో, లేదంటే అలా ఉండాలి అని ఊహించుకునే వ్యక్తిత్వమో తప్ప మనకి మిగిలినవారి గురించి అర్ధం చేసుకోవాలి అని కూడా అనిపించదు చాలాసార్లు. ఒక self confident ఇందిరని ఎంత బాగా embrace చేశారో ఒక slef pity సుధని కూడా అంత బాగా చూపించారు మనకి శ్రీదేవి గారు. వారు రాసిన పి శ్రీ దేవీ కథలు ఈ వారం విడుదల సందర్భంగా ఈ వారం కథలు కబుర్లు ఏంటో వినండి.
----
మరిన్ని కథలు కబుర్లు శ్రవణ రూపంలో వినడానికి దాసుభాషితం యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్:
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2