Listen

Description

Kathalu Kaburlu S02E33

నా దృష్టిలో పాటంటే సాహిత్యం. అది లేకపోతే ఎంతటి సంగీతమైనా రాణించదని నా నిశ్చితాభిప్రాయం. పైగా నేను సంగీతాన్ని పెద్దగా ఆస్వాదించలేను అని కూడా అనుకునేదాన్ని. ఒకపక్కనేమో మా నాన్నగారు ఏదైనా సినిమా పాట విని 'అబ్బా, మోహనరాగంలో ఎంత బాగా ఉంది ఈ పాట. చూడు మేలుకొలుపు పాట కాబట్టీ ఈ music director భూపాలంలో చేశారు పాటని అదీ రసజ్ఞత అంటే' అంటూ చెప్పేస్తారు. ఆయన ఏనాడూ సా పా సా కూడా నేర్చుకోలేదు మరి ఎలా తెలుసు?

అంటే 'వినగ వినగ రాగమతిశయిల్లుచుండు' అన్నట్టు. సంగీత కచేరీలలో రాగం పేరు చెప్పి, వాళ్ళు స్వరసంచారం పాడినప్పుడు విని తెలుసుకున్న రాగాలను, సినిమా పాటల్లో వెతుక్కోగలిగారు అన్నమాట. అలా గుర్తుపడుతూ, పడుతూ మెల్లిగా ఏ పాట ఏ రాగంలో చేశారు అన్నది ఆయనకి ఒక అంచనా వచ్చింది. నిజానికి ఏ కళనైనా ఆస్వాదించాలి అంటే మనకి ఇలాంటి దారులే చాలా ఉపయోగపడతాయి. దీనినే art apreciation అంటారు. ఏ కళని అయినా అర్ధం చేసుకుని, ఆస్వాదించడం అనేది మన వ్యక్తిత్వం మెరుగుపడడంలో ఒక భాగం అని ప్రపంచవ్యాప్తంగా ఎందరో శాస్త్రవేత్తలు చెప్పే మాట.

అలా సంగీతాన్ని అర్ధం చేసుకుని, ఆస్వాదించడానికి ఈ సినీ కర్ణాటకం ఒక గైడ్ గా ఉపయోగించుకోవచ్చు అని నాకు ఈ కార్యక్రమం విన్నాకా అర్ధమైంది. అలాగే నాకు సంగీతాన్ని ఆస్వాదించే లక్షణం లేదు అన్న అభిప్రాయం కూడా పోయింది. దానికి కారణం ఈ న్యూస్ లెటర్ లో పంచుకున్నాను. అందుకే ముందు అది చదివి, తరువాత ఈ సినీ కర్ణాటకం వినండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-cinee-carnatakam-1

----

మరిన్ని కథలు కబుర్లు శ్రవణ రూపంలో వినడానికి దాసుభాషితం యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్:

https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2