Kathalu Kaburlu S02E37
యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణా సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
అంటుంది చండీ సప్తశతి. అందరి బుద్ధి రూపంలోనూ, మరపు రూపంలోనూ, నిద్ర రూపంలోనూ, ఆకలి రూపంలోనూ, శక్తి రూపంలోనూ, ప్రతీ తల్లి రూపంలోనూ ఉన్నది ఆ అమ్మవారే అని చెప్తుంది ఈ వేద భాగం. కానీ అలా చూడడం అంత సులభమా? ప్రతివారిలోనూ పరమాత్మను చూడడం సాధ్యమా? కష్టమే, కానీ ప్రయత్నించినవారు పొందిన శాంతి, సాధించినవారు పొందిన సిద్ధి అనితరసాధ్యం.
అదే విధంగా భార్యలో గృహలక్ష్మి గృహే గృహే అనే ఆర్షవాక్యం గుర్తుంచుకుంటే గృహహింస, molestation, అత్యాచారాలు ఉండవు కదా. అలాంటి మంచి బుద్ధి ప్రపంచంలోని అందరికీ ఆ అమ్మ కటాక్షించాలని కోరుకుంటూ, అందరికీ దసరా అదే భారతీయ మహిళా సాధికార దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ వారపు newsletterలో కావ్యభారతి రెండవ భాగం గురించి, అమ్మవారి గురించి ఆ తల్లి రాయించినంత రాశాను. ఈ blog post లో చదివి, ఈ కథలు-కబుర్లు వినేయండి.
---
కావ్య భారతి ఇక్కడ వినండి : https://www.dasubhashitam.com/ab-title/pc-kavya-bharathi
---
ఇదే కథలు. కబుర్లు రూపంలో దాసుభాషితం యాప్ లో కూడా వినవచ్చు.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2