Listen

Description

kathalu kaburlu S02E39

పిఅల్లరి పిల్లలు విపరీతమైన తెలివిగలవాళ్లు (కథ)

ఒకప్పుడు భాగ్యనగరంలో ఒక గురువు ఉండేవాడు. అతను వైద్యుడు, చాలా జ్ఞానవంతుడు, మనస్తత్వ శాస్త్రం లో చాలా అనుభవజ్ఞుడు. ఆ ఊర్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా అతని దగ్గరకు వచ్చేవారు. ఒక రోజు, ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి తన పిల్లలు ఇద్దరు చాలా అల్లరి చేస్తున్నారని, ఎన్నిసార్లు మార్చడానికి ప్రయత్నించినా మారడం లేదని, ఎంత కొట్టినా, తిట్టినా, చెప్పినా మాట వినడం లేదని చెప్పాడు. కాని వాళ్ళు బాగా తెలివైన వారు. ఆ తెలివిని వారు సరిగా ఉపయోగించక అల్లరి చేయడానికి ఉపయోగిస్తున్నారు అని వాపోయాడు.

గురువు ఆ వ్యక్తి చెప్పింది విని, తన పక్కన ఉన్న రెండు రాళ్ళను తీసుకుని ఒక దానితో ఒకటి రాపిడి చేయడం మొదలు పెట్టాడు. ఆ వ్యక్తి గురూజీ ఏం చేస్తున్నారు ? అని అడిగితే, "నేను ఈ రెండు రాళ్ళని అరగదీస్తున్నాను. ఇలా ఈ రెండిటిని అద్దంగా మారే వరకు అరగదీసి, అద్దంగా మారాక అప్పుడు నేను నా మొహాన్ని అందులో చూసుకుంటాను" అన్నాడు.

ఆ వ్యక్తి ఆశ్చర్యపడి పోతూ గురూజీ, మీరు ఎంత కష్టపడి ఆ రెండు రాళ్ళని అరగదీస్తూ ఉన్నా వాటిలో ఘర్షణ పుడుతుందే గాని అవి అద్దంగా మారవు అన్నాడు.

గురూజీ, "నేనూ అదే చెబుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వొక విషయాన్ని పరిశీలించి గ్రహించావు. రెండు రాళ్ళని పట్టుకుని అరగదీస్తే వాటి మధ్య ఘర్షణ పుడుతుంది కాని అవి అద్దాలుగా మారవు అని. అలాంటి గ్రహింపు పిల్లల పెంపకంలో లో కూడా నువ్వు గ్రహించాలి. పిల్లలల్ని కొట్టడం, తిట్టడం, లేదా బెదిరించడం, హెచ్చరించడం వంటి కఠిన పద్దతుల ద్వారా మార్చాలని చూస్తే వారిలో నువ్వు వారిలో ఘర్షణని చూస్తావు కాని మంచి మార్పుని చూడలేవు. నువ్వు నీ పిల్లలపై ఎంత ఘర్షణని సృష్టిస్తావో వాళ్ళు అంతగా రాతి హృదయులు అవుతారు. నువు నీ పిల్లల్లో చూడాలి అనుకున్న మార్పుని నీలోనే తెచ్చుకుంటే వాళ్ళు నిన్ను చూసి నేర్చుకుంటారు. నువ్వు ప్రతి విషయంలోనూ, ఆత్మ విమర్శతో, విచక్షణతో ఆలోచిస్తూ, ఏ విషయం అయినా జరగడం వెనక కారణం ఏమిటో తర్కిస్తూ, నిజం ఏమిటో తెల్సుకుంటూ, పిల్లలతో చర్చిస్తూ ఉంటే అదే పిల్లలు చూస్తూ, తెల్సుకుంటూ, అవలోకనం చేసుకుంటూ ఎదుగుతారు. నువ్వన్నట్లు వాళ్ళు అల్లరి పిల్లలే కాని విపరీతమైన తెలివిగలవాళ్ళు కాబట్టి నిన్ను చూసి బాగా నేర్చుకుంటారు lead like a example లా కాకుండా live like a example గా ఉంటూ వారిని మార్పు వైపుకి నడిపించడం ఎంతో మెరుగు అని గురూజీ ముగించాడు.

ఆ వ్యక్తి గురూజీ మాటలు విని చాలా ఆలోచించాడు. గురూజీ ఒక ఉదాహరణ చూపి ఎలా అయితే తన సమస్యని పరిష్కరించారో, అలానే తానూ ఒక ఉదాహరణగా ఉంటూ తన పిల్లల్లో మార్పు తీసుకురావాలి అని నిర్ణయించుకున్నాడు.

ఈ నెల మొదటి శనివారం జరిగిన ప్రసంగంలో ఇలాంటి ఉదాహరణలు, దృష్టి కోణాలు, ఆసక్తికర ప్రశ్నోత్తరాలు కూడా అనేకం జరిగాయి. ఆ ప్రసంగం గురించి రాసిన న్యూస్ లెటర్ ని ఇక్కడ బ్లాగ్ లో చదవచ్చు లేదా దాసుభాషితం యాప్లో శ్రవణ రూపంలో వినవచ్చు. పేరెంటింగ్ – శైశవం నుండి కౌమారం వరకు పూర్తి ప్రసంగాన్ని యూట్యూబ్ లో చూడండి. లింక్స్ కింద ఉన్నాయి.
---
1. బ్లాగ్ పోస్ట్ : https://www.dasubhashitam.com/blog/parenting-oka-kala
2. కథలు. కబుర్లు. : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2
3. పేరెంటింగ్ ప్రసంగం యూట్యూబ్ : https://www.youtube.com/watch?v=mW03qGAhTb0