Listen

Description

Kathalu. Kaburlu. S02E40

"ఈ నవల చలం గారికి నచ్చలేదు. కానీ నాకు నచ్చింది. మొదటిసారి చదివనప్పుడు ఉన్నంత ఉత్సాహం రెండోసారి చదివినప్పుడు లేకపోయినా, తప్పిపోయిన పాత మిత్రుణ్ణి చూసినప్పుడు కలిగినంత ఆనందం కలిగింది ఈ పుస్తకం చూసినప్పుడు" అని చెప్పుకున్నారు ఈ నవలా పరిచయంలో మాలతీ చందూర్ గారు.ఇంతకీ చలం గారికి ఈ నవల ఎందుకు నచ్చి ఉండదు? స్త్రీ స్వేచ్ఛను తీవ్రంగా కాంక్షించే చలం గారికి, ఒక అమ్మాయి తన జీవితాన్ని ఒక కుటుంబానికి అంకితం చేయడం ఎలా నచ్చుతుంది?. అయితే, అది ఆమె ఇష్టమైనప్పుడు, తనకి పూర్తిగా ఇష్టం అయ్యి అలా వారి సేవలో ఉండిపోయినప్పుడు ఆ నిర్ణయాన్ని గౌరవించాలని అనిపించింది.ఒకసారి మీరు కూడా ఈ పరిచయాన్ని విని చూడండి. మీ అభిప్రాయం ఏమిటో పంచుకోండి. ఇదో సర్వేలాగా ఉపయోగపడుతుంది. వచ్చే సోమవారం నాడు మన సభ్యుల అభిప్రాయాలను పూర్తిగా చదివి, ఎవరు ఎటు నుంచున్నారో అంచనా వేయడానికి ప్రయత్నిద్దాం. ఏమంటారు?

---

ఈ పరిచయం మీద రాసిన newsletter, కథలు-కబుర్లు ఇవిగో.
1. బ్లాగ్ పోస్ట్ : https://www.dasubhashitam.com/blog/anukunnamani-jaragavu-anni2.

కథలు. కబుర్లు. : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2

3. శ్రవణ పుస్తకం : https://www.dasubhashitam.com/ab-title/pc-the-valley-of-decision