Listen

Description

kathalu kaburlu S02E41

మెలుకువ ఉన్నంతసేపూ నా మెదడు ఏదో ఒక పనిలో ఉంటుంది. ఇంటిపని కావచ్చు, ఆఫీస్ పని కావచ్చు, ఏదైనా పుస్తకం చదవడం కావచ్చు, ఏమీ లేకపోతే instagram reels, youtube shorts, interviews, series ఇలా క్షణం తీరికలేకుండా నా మెదడుని ఏదో దాని వెనుక పరిగెట్టించడమే అలవాటు.

కుదురుగా కూర్చోనిచ్చి, నిశ్చలంగా ఆలోచిస్తే గతంలోకో, భవిష్యత్ లోకో జారుకుంటోంది. అందుకే అతి entertainment తో దాని నోరు మూయించడం చాలా సులువు మార్గం నాకు. కానీ, కొన్ని రోజుల క్రితం అది తిరుగుబాటు చేసింది. నువ్వు నా సొద విని, కాస్త ముళ్ళు విప్పుతావా, చస్తావా అని బెదిరించింది. మా ఇంటి దీపావళి cleaning నాకు ఒక పూటలో అయిపోయింది. కానీ ఈ బుర్ర cleaning మాత్రం రోజున్నర పట్టింది.

నాకు సినిమాలు, నవలల్లో హీరోయిన్లకు జరిగినట్టు యాదృచ్ఛికమైన విషయాలు ఎక్కువ జరుగుతుంటాయి. ఈ బుర్ర బూజు దులుపుకుంటున్న సమయంలోనే బుచ్చిబాబు గారి 'నన్ను గురించి కథ వ్రాయవూ?' కథా సంపుటి విని, newsletter రాయాల్సిన పని తగులుకుంది. మొదట వినడం మొదలెట్టినప్పుడు పెద్దగా ఎక్కలేదు కానీ, తరువాత నా సమస్యకి సమాధానం దొరికింది. నాతో నేను మాట్లాడుకోవడం కాస్త పట్టుపడింది.

ఈ newsletter లో ఒక practice task రాశాను. మీలో ఆసక్తి ఉన్నవారు ప్రయత్నించి చూడండి. నాకు చాలా ఉపయోగపడింది ఆ పద్ధతి. కాబట్టీ, మీరూ ప్రయత్నించండి. ఇవిగో ఈవారం కథలు కబుర్లు లింకులు వినండి.. చదవండి..

---

ఈ పరిచయం మీద రాసిన newsletter, కథలు-కబుర్లు ఇవిగో.

1. బ్లాగ్ పోస్ట్ : https://www.dasubhashitam.com/blog/manatho-manam-matladukovadam-yela

2. కథలు. కబుర్లు. : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2

3. Nannu Gurinchi Katha rayavoo Novel : https://www.dasubhashitam.com/ab-title/ab-nannu-gurinchi-katha-rayavoo