Kathalu Kaburlu S02E42
తెలుగు వికీపీడియాలో activeగా రాసేటప్పుడు నేను ఇష్టంగా చేసే పని translations. ఆంగ్ల వికీలో ఉండే వ్యాసాలను తెలుగులోకి అనువాదం చేసేదాన్ని. అయితే, మాకు అప్పట్లో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే Google translated articles. తమ tool ను మెరుగుపరచుకోవడం కోసం, దానికి తెలుగు నేర్పడం కోసం గూగుల్ సంస్థ వారు తెలుగు వికీని దారుణంగా వాడుకున్నారు. వచ్చీ రాని భాషలో ఉడకీ ఉడకని వ్యాసాలని నేరుగా ప్రచురించేశారు.
ఆ వ్యాసాలను శుద్ధి చేయడంలో ఎందరో వికీపీడియన్లు ఎన్నో రోజులు శ్రమించారు. అందులో నేను ఒకదాన్ని. మా చిన్నప్పుడే NLP మెషిన్ కి భాషలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని తెలుసు. ఈ వ్యాసాలు చూసినప్పుడు ఆ NLP మీదా, google translate మీదా పీకల దాకా కోపంగా ఉండేది. తరువాత, అది learning stageలో ఉంది కాబట్టీ అలా అధ్వానంగా ఉంది అని అర్ధమైంది కానీ, ఆ సంస్థ వారు వికీపై చేసిన చర్య మాత్రం ఇప్పటికీ క్షమించలేను.
అందుకే, ఈ శనివారం జరిగే ప్రసంగాలు కార్యక్రమంలో ఈ కృత్రిమ మేధ గురించి తెలుసుకోవాలనిపిస్తోంది. నిజానికి కృత్రిమ మేధ వలన మనకి జరిగే లాభం కన్నా, నష్టం పాళ్ళే నా కళ్ళకి ఎందుకో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాని గురించి పూర్తి అవగాహన లేకపోవడం వలన అలా అనిపిస్తోందేమో అని నా డౌటనుమానం. ఆ డౌట్లు, అనుమానాలు అన్నీ ఇప్పుడు తీరిపోతాఏమో చూద్దాం .
---
ఈ వ్యాసాన్ని బ్లాగ్ పోస్ట్ గా చదవచ్చు, App లో కథలు-కబుర్లు గా కూడా వినచ్చు. లింక్స్ ఇవిగో :
1. బ్లాగ్ పోస్ట్ : https://www.dasubhashitam.com/blog/manatho-manam-matladukovadam-yela
2. కథలు. కబుర్లు. : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2
3. Nannu Gurinchi Katha rayavoo Novel : https://www.dasubhashitam.com/ab-title/ab-nannu-gurinchi-katha-rayavoo