Kathalu Kaburlu S02E43
మా బామ్మ 1936 లో పుట్టారు. ఎలిజబెత్ 2 రాణి కంటే పదేళ్ళు చిన్న. ఆవిడ లాగే రెండవ ప్రపంచ యుద్దం చూసారు, స్వాతంత్ర్య పోరాటాలు చూసారు, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలు చూసారు. చాలా చారిత్రక విషయాలకి సాక్షిగా ఉన్నారు. ఇలా ఎన్నో చూసిన మా బామ్మ తన 87 ఏళ్ల జీవితంలో వస్తున్న టెక్నాలజీకి ఆశ్చర్యపోతూ, కొన్నిటిని Adopt చేసుకుంటూ, కొన్నిటితో Keep up అవుతూ కొన్నిటిలో వెనకపడిపోతూ వచ్చారు. దీపాల వెలుగు మాత్రమే చూసిన ఆవిడ బాల్యం ఎలక్ట్రిక్ దీపాల కాంతిలో వెలిగిపోతున్న మా బాల్యం చూసి సంతోషించింది. సినిమాలు అంటే కేవలం హాల్ లోనే చూస్తారు అనుకుంటుంటే ఇంటికి TV వచ్చింది, పచ్చళ్లు రొకట్లోనే చేయాలి అనుకుంటుంటే mixi, grinder వచ్చాయి. అలాంటి ఆవిడ ఇది కేవలం "Myth" అని అనుకున్నది ఏమైనా ఉంది అంటే అది మాయాబజార్ సినిమాలో సావిత్రి గారు , నాగేశ్వర రావు గారు మాట్లాడుకున్న ప్రియదర్శిని పెట్టె. ఉత్తరాల నుంచి వేగంగా అందె టెలీ గ్రాంలు, టెలీ ఫోన్లు వరకు జరిగిన Transition ని బాగానే పట్టుకున్న మ బామ్మ Video Call అనేది ఒక "Myth" అనుకుంటున్న టైమ్ లో వేరే ఊర్లో ఉన్న నాకు ఫోన్ చేసి ఇమ్మంటే మా అక్క వీడియో కాల్ చేసి ఇచ్చింది. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటుంటే అలా కాదు కళ్ల ముందే కొంచం దూరంలో పట్టుకోమని అక్క చెప్పింది. మా బామ్మకి ఏం అర్ధం కాలేదు. ఇటు నుంచి ఫోన్ ఎత్తిన నేను నీవేనా నను తలచినది, నీవేనా నను పిలచినది అంటూ పాట అందుకున్నాను. అప్పుడు ఆవిడ రియాక్షన్ లైవ్ లో చూడాలి వీడియో కాల్ ని ప్రియ దర్శిని అని అరుస్తూ ఆశ్చర్యపోయారు. వీడియో కాల్స్ 1970లో వచ్చినా, 2000 సంవత్సరానికి భారతదేశంలో ఉపయోగిస్తున్నా, skype లాంటివి తర్వాతి కాలంలో వచ్చినా మా బామ్మకి మొట్ట మొదట వీడియో కాల్ పరిచయం అయింది 2017లో వాట్సాప్ వీడియో కాల్ ద్వారానే. అన్నీ ఫోన్ ఏ చక్క బెట్టేస్తుండటం 87 ఏళ్ల వయసులో ఆవిడ చూస్తుంటే Rip Van Winkle vibes వస్తూ ఉంటాయి నాకు. అలాంటి మా బామ్మ కి రేపు నేను ఊరెళ్ళాక మన AI Talk ప్రసంగం చూపిస్తే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అని చాలా ఆసక్తిగా ఉంది. ఆవిడ చేత ఒక prompt ఊహించేలా చేసి, నేను రాసి Chat GPT4 కి ఆ Prompt ఇచ్చి ఇదిగో నువ్వు అడిగిన బొమ్మ అని చూపిస్తే ఆవిడ కాలం ఎంత మారిపోయింది రా ! సాంకేతికత ఇంత దూరం వచ్చేసిందా ? అని ఆశ్చర్యపోవడం ఈసారి కళ్ళార చూడచ్చు.
ఇంతకీ ఈ AI ప్రసంగం గురించి, Google Bard విడుదలకి ముందు Black Box అనే అంశం పై సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్య గురించి రాసిన న్యూస్ లెటర్ ఇక్కడ చదవచ్చు, లేదా కథలు కబుర్లు పాడ్ కాస్ట్ లో యాప్ లో వినచ్చు. లింక్స్ :-
Blog:- https://www.dasubhashitam.com/blog/ammammaku-kooda-ardhamayye-ai-talk
Podcast:- https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2
AI కృత్రిమ మేధ పూర్తి ప్రసంగం లింక్ : https://youtu.be/v1ZfqIs-4Lg?si=F6A6vWdaNHFmA4uv