Kathalu Kaburlu S02E46
మాది కంచుమర్రు అని అత్తిలి మండలంలో ఉన్న ఒక గ్రామం. ఎనిమిదేళ్ళ వయసు వరకూ నా బాల్యం అంతా ఆ ఊరిలోనే గడిచింది. పెంకుటిల్లు, వీధి అరుగులు, ఇంటి ఎదురుగా కాలువ, కాలువ గట్టు అంతా చెట్లు, ఇంటి ముందు కూడా రకరకాల మొక్కలు.. ఇలా కథల్లో వర్ణించే పల్లెటూరు వాతావరణంలో పెరిగాను నేను. అందుకే కథల్లో వచ్చే ఇలాంటి వర్ణనలను త్వరగా పట్టుకోగలను. ఆ ప్రదేశాలకు క్షణంలో చేరుకోగలను.
నా ఈ చిన్ని జీవితంలో అతిపెద్ద మలుపు మా నాన్నగారి బదిలీ. తాడేపల్లిగూడెం అనే పట్టణం వెళ్ళబోతున్నాం అని తెలిసినప్పుడు, నా ఊహ ఎంత గారడీ చేసిందో చెప్పలేను. అప్పటికి పట్టణం అంటే అత్తిలి, భీమవరమే తెలుసు నాకు. అది కూడా కొన్ని వీధులే. అందుకే నేను క్రమం తప్పకుండా చదివే కథల పుస్తకాన్ని ఆసరగా తీసుకున్నాను. అందులో జాతీయ, అంతర్జాతీయ కథలలో వర్ణించే పట్టణాలను ఊహించుకున్నాను.
విశాలమైన వీధికి అటు పక్క, ఇటు పక్క డాబాలు. వీధి చివర్లో రెండు అంతస్థుల మేడ. వారికి ఒక బొచ్చు కుక్క. వీధి మొగల్లో ఒక వైపు departmental store, మరో వైపు రోజాలు, డాలియాలు వంటి గొప్ప పువ్వులు అమ్మే boquet shop. రహదారికి రెండు వైపులా చెట్లు ఇలా ఉండేది నా ఊహ.
తీరా వెళ్ళాకా ఆ ఊహ కొంత మాత్రమే నిజం. అన్నీ పెంకుటిళ్ళే, రెండు వీధుల అవతల మా ఊళ్ళో ఉన్నదాని కన్నా కొంచెం పెద్ద కిరాణా కొట్టు ఉంది తప్ప, departmental stores గట్రా ఏమీ లేదు. ఇక boquet shop గురించి నేను చెప్పనవసరం లేదేమో. ఒక రెండు అంతస్థుల మేడ, చెట్లు మాత్రం ఉన్నాయి. చిన్న ఊరు నుండి, పెద్ద ఊరికి వచ్చినట్టు అనిపించింది మా వీధి చూసి.
ఈ విషయం గుర్తు చేసుకున్నప్పుడల్లా ఊహ అనేది చిన్నారి మనసులుకు, వారి ఎదుగుదలకు ఎంత ముఖ్యమా అనిపిస్తుంటుంది నాకు. నాకు నేనే ఒక అందమైన వీధిని సృష్టించుకుని, దాదాపు రెండు నెలలు ఆ వీధిలో మానసికంగా తిరగగలగాడినికి నా పఠనమే కదా కారణం. అందుకే మండువ రాధ గారు తన 'పిల్లలు - బొమ్మలు' పుస్తకానికి permission ఇచ్చినప్పుడు నా ద్వారా దాసుభాషితం చిన్నారి శ్రోతలకు ఈ పుస్తకం అందితే బాగుంటుంది అనిపించింది(పూర్తిగా నా స్వార్ధమే).
అందుకే, పాపం మీ శ్రవణ, మానసిక ఆరోగ్యాలను అస్సలు దృష్టిలో ఉంచుకోకుండా నా అద్భుతమైన గాత్రంలో రికార్డ్ చేసేహేసేశాను. ప్రభ గారు, మన content moniter చేసే రమా సుందరి గారు చాలా బాగా చదివారు అని మెచ్చుకున్నారు(privateగా లెండి) అంటే మీ ఆరోగ్యం safe అనే కదా. కాబట్టీ, నిరభ్యంతరంగా, నిర్భయంగా వినండి. మీకు బుజ్జాయిలు ఉంటే వారికీ వినిపించండి. పిల్లలు involve అయ్యారు కాబట్టీ శాపాలు గట్రా పెట్టను లెండి.
ఈ వారం newsletterలో ఈ release గురించే కాక, దాసుభాషితం app release గురించి కూడా update ఉంది. కాబట్టీ, కథలు-కబుర్లు వినక తప్పదు, blog post చదవకా తప్పదు.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2
https://www.dasubhashitam.com/blog/kotta-dasubhashitam-app-vidudala