Kathalu Kaburlu S02E47
భక్తి - శక్తి
నోలాన్ తీసిన Batman Begins సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.
If you make yourself more than just a man, if you devote yourself to an ideal, you become something else entirely. Which is "A Legend mr Wayne"
చరిత్ర చూసుకుంటే ధ్రువుడి, ప్రహ్లాదుడు, గోదా దేవి, ఆళ్వార్లు, నాథముని, రామానుజులు, అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు ఇలా చెప్పుకుంటూ వెళితే లిస్ట్ చాలా ఉంటుంది. వీరంతా ఉత్కృష్టమైన భక్తితో వారిని వారు పూర్తిగా ఒక ideal (or Idol) కి సమర్పించుకుని తన్మయత్వంలో మునిగిపోయి ఎన్నో శ్లోకాలను, గీతాలను, పాశురాలను, పద్యాలను, కీర్తనలను సృష్టించారు వాటి నుంచి ఎంతో సాహిత్యం వచ్చింది, వాటిని ఆధారంగా చేసుకుని ఇంకా ఎంతో సాహిత్యాన్ని నేటికీ సృష్టిస్తున్నారు.
వీరే కాదు చాలా మంది వారు అనుకున్న పని చేయడం కోసం ఆ పనిలో పూర్తి భక్తితో లీనమైపోయి జాతులను, మతాలను, ideology లను, సాహిత్యాన్ని సృష్టించి వాటిని ఎంతో మంది జనం వారి అభిమతంగా చేసుకుని అభిమానులుగా ఫాలో అయ్యేలా చేసారు.
ఇలాంటి బలమైన Will వివిధ రూపాలలో మనలో కూడా ఉంది. ఒక ఛారిటబుల్ ట్రస్ట్ ని పెట్టి చాలా మందికి సహాయపడటం, ఒక సత్రాన్ని కట్టి ఎంతో మందికి నీడను, కూడుని ఇవ్వడం, ఒక ఆసుపత్రిని కట్టి మెరుగైన వైద్యాన్ని అందించడం, మధ్య యుగంలో రామానుజులు, మధ్వాచార్యుల వారిలా ఒక భక్తి ఉద్యమంని మొదలు పెట్టి ఎంతో మందికి ఒక పర్పస్ ని కలిగించి ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లడం, ఒక యూట్యూబ్ ఛానెల్ ని పెట్టి తను నేర్చుకున్న జ్ఞానాన్ని అంతా ఉచితంగా ధారబోయడం ఇలా ఒక్కో మనిషికి ఒక్కో Ideology, ఒక్కో devotion.
అలాంటి ఒక devotion గురించి , Ideology గురించి ఒక జాతి మొత్తాన్ని కదిలించిన శ్రీ వైష్ణవం Movement గురించి, ఒక మతస్థాపన నుండి, వ్యాప్తి వరకూ జరిగిన చరిత్ర, అందు నుండి పుట్టిన సాహిత్య సృష్టి గురించి వచ్చే శనివారం జరగబోయే ప్రసంగంలో చంద్ర మోహన్ గారి ద్వారా తెలుసుకోడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2
https://www.dasubhashitam.com/blog/hari-avatharamule-akhila-devathalu