#కథలుకబుర్లు సీజన్ 2 చాప్టర్ 5
నెల నెలా మొదటి శనివారం 'దాసుభాషితం ప్రసంగాలు' నిర్వహిద్దామనుకుంటున్నాము.ఇందులో తెలుగు సమాజంలో ఉన్న వివిధ రంగాల నిపుణులతో ప్రసంగం ఇప్పించాలని ఆలోచన. ఈ ప్రసంగాలు భాషా, సాహిత్యం, సంగీతం, కళలు, చరిత్ర, ఆధునిక శాస్త్రాలు మొదలైన వాటిపై ఉంటాయి. ప్రసంగీకులు సెలబ్రిటీస్ అయ్యుండవలసిన అవసరం లేదు. కానీ Subject Matter Experts మాత్రం అయ్యుంటారు. మన సమాజంలో ఉన్న ఎందఱో ఆణిముత్యాలను పరిచయం చేసే అవకాశాన్ని దాసుభాషితం ఇలా కల్పించుకుంటుంది.
ఈ ప్రసంగాలకు సంబంధించి మరింత సమాచారం ఈ పాడ్కాస్ట్ లో వినండి.