శుభోదయం అండీ..మీకు ఈ లేఖ చేరెవరకు శుభోదయం అవుతుంది...అందుకే అలా అన్నానులేండీ నేనెవరని ఆలోచిస్తూన్నారా.......ఆగండీ ...ఆగండీ...ముందు నేనెందుకు ఈలేఖ వ్రాసానో చదవండి .....మీకు కూడా తేలిని మిమ్మల్ని మీకు పరిచయం చేద్దామని .....నా మనసులో ఉన్న మీరు మీకు తేలిదుగా.....చెప్తాను....నింపాదిగా చదవండీ ..మీ మనసు తో......మీ ఉదయం పరిమళ భరితం ..చక్కగా లేస్తూనే నిద్రలేస్తున్నట్టు గా కాకుండా పూతొటలోని పూవు పూయగానే నడిచి వచ్చినట్టు ఉంటుంది మీ మోము..... బాధ్యతలు ఎన్ని ఉన్నా చిరునవ్వు నే మోస్తారు.....ఇంటి పని వంట పని ఏ పని ఐనా ..పాటల వింటు మొదలు పెట్టి పాటలతో నే ముగిస్తారు.........ఒక మాహానుభావుడు అన్నట్టు మనసు కి వెసిన దురద తీరుస్తారు...ఇంకో మాట మీ పాటల సేకరణ అద్బుతం..చక్కటి సంధ్యాసమయాన..పూజకో పువ్వు.....మీజడకో పువ్వు .....మీ మోము పై చిరునవ్వు ...మీ మాటలు చిలకపలుకులా..మీఅడుగులు హంసనడకా...మీచుపు వెన్నల జల్లులా...మీ మాట మనసుకి తాకే పులచేండులా.. ఇన్ని చెప్పినా నేనెవరో చెప్పలేను..మీకు ఈపాటికి అర్ధం అయివుంటుంది లేండీ కాని మీకు అర్ధంకాని ఒక విషయం ఎమిటంటే..నేను మీ ఆరాధకుడినీ.. చల్లని వెన్నల ని చూస్తూ ...గల గల పారే సెలయేరుని చూస్తూ ......పచ్చని పైరుని చూస్తూ .....అందమైన బాపు బోమ్మ ని చూస్తూ..... ..ఎలా ఆనందిస్తూ...ఆస్వాదిస్తూంటామో మీమ్మల్ని చూస్తూ నెేను అంతేనండీ ...ధన్యవాదాలు అర్థంచేసుకుంటున్నందుకు.....
Written by Laxmi Tandra
Follow IG@ lakshmitandra
Narrated by Pavani Kotrike
Follow IG @pavanii_angel
Follow us on IG @pureperceptionpodcast
www.p2podcasts.com