Listen

Description

గవరయ్య ఆ ఊళ్ళో ఓ వింతమనిషి. అకారం వికారం. ఎవ్వరితో మాట్లాడడు, ఎప్పుడూ నవ్వడు, బస్తీలో వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదించినా పైసా దానం చెయ్యడు. మున్సబు, కరణం ఎంత ప్రయత్నించినా అతడి వద్దనుంచి పైసా కూడా విరాళం తీసుకోలేకపోయారు. మొదటి భార్య కాలుజారి నూతిలో పడి చనిపోయింది. తనకంటే పదిహేనేళ్ళు చిన్నదైన అమ్మాయిని రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఎవ్వర్నీ ఇంట్లోంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు. ఎలా జరిగిందో ఏమో, రెండో భార్య ఎదురింట్లో ఉండే దర్జీతో లేచిపోయింది. అప్పుడేం జరిగింది? అసలు గవరయ్య వింతప్రవర్తనకు కారణమేమిటి? తన పరిధిలో తను బ్రతికే గవరయ్య దుర్మార్గుడు కాదు కదా. ఐనా ఊళ్ళో వాళ్ళందరికీ అతనంటే ఎందుకంత ద్వేషం? ఇంతకీ అతడు 'దేవుణ్ణి చూసినవాడు ' ఎలా అయ్యాడు? ఎప్పుడయ్యాడు? దేవరకొండ బాలగంగాధర తిలక్‌గారి అత్యద్భుత కథనంతో సాగే కథ. పరిచయం, విశ్లేషణ - కిరణ్‌ప్రభ
Full Story Link: https://drive.google.com/file/d/1r6lCNUXML7N2uLGkrT2aHaZFTF4pubNO/view