Listen

Description

#KiranPrabha #Munemma #DrKesavaReddy
40 మైళ్ల దూరాన జరిగే సంతలో గిత్తను అమ్మేస్తానని వెళ్ళిన భర్త తిరిగిరాలేదు. గిత్త ఒక్కటే వచ్చేసింది. ఎప్పుడు ఉన్న ఊరు దాటి వెళ్ళని మునెమ్మ అదృశ్యమైన భర్తను వెదుక్కుంటూ బయలుదేరింది.. పెనిమిటి బతికుంటే అది అన్వేషణ, ఒకవేళ చనిపోయి ఉంటే అది హంతకుల కోసం సాగే వేట. ఆ ఒంటరి ప్రస్థానంలో మునెమ్మ కెదురైన మనుషులు చెప్పేవి నిజాలా? అబద్ధాలా? ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుమానించాలి? అసలు పెనిమిటి సంగతి ఎలా తెలుస్తుంది? ఆ ప్రయాణంలో మునెమ్మకు ఎలాంటి సన్నివేశాలు ఎదురయ్యాయి? బీభత్సరస ప్రధానమైన పతాక సన్నివేశంలో ఏం జరిగింది? డా. కేశవరెడ్డి గారి అద్భుత సృజన 'మునెమ్మ ' నవల. అడుగడుగున ఉత్కంఠ కలిగించే సస్పెన్స్ డ్రామా. కిరణ్ ప్రభ కథనం, విశ్లేషణ వినండి..