Listen

Description

గణనాధునికి అనేక రకాల పత్రాలతో (ఆకుల) పూజ చేస్తాం. ఔషధ గుణాలున్న ఈ పత్రాలను నవరాత్రులలో ఇంట్లో ఉంచుకున్నందువల్ల పత్రాల నుండి, అలాగే కొత్తమట్టితో తయారుచేసిన గణనాధుడి నుండి ప్రాణవాయువులు వెలువడి ఆ కుటుంబంలోని అందరికి ఆయురారోగ్యాలు పంచుతుంది. ఇది మన పూర్వులైన ఋషులు కనుగొని మనకు నేర్పిన విషయం. దీనిని నేటి మన వైద్యులు కూడా నొక్కి చెబుతున్నారు.

నిజానికి వినాయక చవితి పూజలో వాడే పత్రాలన్నీ చెట్టు నుండి విడిపోయిన 48 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అంతేకాక వాటిని 9 రోజుల అనంతరం నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటి నుండి వెలువడే ఆల్కలాయిడ్స్ నీటిలోకి చేరి అక్కడి రోగకారక క్రిములను, చెడు పదార్థాలను నాశనం చేస్తాయి. ఆ నీటిలో ప్రాణవాయువు శాతాన్ని పెంచుతాయి. అంతేకాక ఆ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది. పత్రిని చేతితో ముట్టుకోవడం వలన కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరంలోకి శోషణం చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. పిల్లలకు పత్రి సేకరణ వలన విజ్ఞానము, వినోదము, పర్యావరణ పట్ల స్నేహ భావము కలుగుతాయి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి.