Listen

Description

Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/830841 to listen full audiobooks.
Title: [Telugu] - Nala Damayanti
Author: Anand Neelakantan
Narrator: Multiple Narrators
Format: Unabridged Audiobook
Length: 4 hours 17 minutes
Release date: March 15, 2022
Genres: Fairy Tales & Folklore
Publisher's Summary:
సృష్టికర్త బ్రహ్మ లోకాన్ని అంతం చేయదలచి రీసెట్ బటన్ ఒత్తడానికి సిద్ధమయ్యాడు. మానవులంటే విసుగు ఆయనకి, వాళ్ళని సృష్టించడమే ఆయన చేసిన మహాపరాధం. మానససరోవరంలోని బంగారు హంస హేమంగకి మనుషులంటే వల్లమాలిన ఇష్టం. బ్రహ్మ వాళ్ళని అంతం చేయదల్చుకున్నాడని విని, మనుషుల్లో నిజమైన ప్రేమ ఉంటుందని నిరూపించడానికి ఒక్క అవకాశం ఇవ్వమని ఆయనని ఆర్థిస్తాడు. కలహప్రియుడైన నారదుడు ఆ బుజ్జి పక్షిని విదర్భ రాజ్యానికి పంపిస్తాడు. నిషాదుల రాజు నలుడిని, విదర్భ రాకుమార్తె దమయంతిని కలపమని చెప్తాడు. దమయంతి అందాల రాశి మాత్రమే కాదు, ధీశాలి. ఆమె అబల కాదు, రాకుమారుడు వచ్చి రక్షించాలి అనుకునే రకం కాదు. నలుడుకీ ప్రేమపై ఆసక్తి లేదు, తన తెగ కోసం నగరం నిర్మించడంలో తలమునకలై ఉన్నాడు. అదీ కాక, అతనో తెగకు రాజు. దమయంతి తన తాహతుకి మించినది అతనికి తెలుసు. ఆ బుజ్జి పక్షి చేయాల్సిన పని ఒక్కటే, ఒకటావ్వాలన్న ధ్యాస లేని ఈ ఇద్దరినీ ఒకటి చేయడమే! హేమాంగ వాళ్ళిద్దరినీ దాదాపుగా ప్రేమలో పడేస్తాడు. దమయంతి స్వయంవరం నిశ్చయమైంది. దేవతల్లోకల్లా బలవంతుడు కలి కూడా ఆమెపై కన్ను వేసాడు. ఇంద్రుడు, అగ్నిలా అతనో సరదా దేవుడు కాడు. కలి అతను! మానవుల కోపం, స్వార్థం సృష్టించాయి అతన్ని. బ్రహ్మ సృష్టించలేదు కాబట్టి భూలోకంలోనే ఉండిపోయాడు. మానవులు ఉన్నంతవరకూ అతనికి విడుదల లేదు. మానవులని కాపాడాలన్న హేమాంగ ప్రయత్నం గురించి తెలుసుకున్న కలి, అదే అదను అనుకున్నాడు. నల దమయంతులని విడదీసి, దమయంతి నలుడుని వద్దనుకునేలా చేస్తే ఆడదాని మనసులో నిజమైన ప్రేమ లేనే లేదని బ్రహ్మకి నిరూపించవచ్చు. దానితో బ్రహ్మ మానవజాతిని నిర్మూలిస్తే, కలికి స్వేచ్ఛ లభిస్తుంది. మానవ జాతి మనుగడకు, మహాబలి కలికి మధ్య అడ్డుగా ఉన్నది, ఆ బుజ్జి పక్షి, దమయంతి పట్టుదల.