రాముని పట్టాభిషేకం అయ్యి రాజ్య పాలన చేస్తుండగా అగస్త్య మహాముని అయోధ్య వచ్చారు. మునులందరూ ఇంద్రజిత్తుని లక్ష్మణుడితో సంహరించిన వైనం తమకు ఆశ్చర్యం కలిగించిందని అనేసరికి రాముడికి ఆశ్చర్యం కలిగి ఇంద్రజిత్తుని వృత్తాంతం చెప్పమని కోరాడు. దానికి అగస్త్యుడు ఇలా చెప్పసాగాడు.