Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/836446 to listen full audiobooks. Title: [Telugu] - Antarjaateeyam Author: K.Balagopal Narrator: Murali Format: Unabridged Audiobook Length: 11 hours 30 minutes Release date: July 25, 2022 Genres: Current Affairs, Law, & Politics Publisher's Summary: సోవియట్ సమాజం ఎంత అనాకర్షణీయమైన వ్యవస్థ అయినా అది ఉండబట్టే అంతర్జాతీయ రాజకీయాలలో అమెరికా సామ్రాజ్యదాహం కొంత మేరకు అదుపులో ఉండిందని ఇప్పుడు స్పష్టంగా అర్థం అవుతున్నది. అమెరికా, రష్యా కూటముల మధ్య 50 ఏళ్ళపాటు ఉండిన సమతుల్యం అసమతుల్యమే అయినా, అణు యుద్ధం అంచున ఉన్న శాంతే అయినా, చిన్నాచితక దేశాలను పెద్దవారి ప్రయోజనాల కోసం కొట్లాడించిన ప్రచ్ఛన్న యుద్ధమే అయినా ఐక్యరాజ్యసమితి రూపంలో మానవ నాగరికత సాధించినట్లు కనిపించిన ప్రౌఢత్వానికి మూలం అదేనని ఇప్పుడు అర్థం అవుతున్నది. మానవులు ఏవో ప్రత్యేకమైన పరిస్థితులలో తప్ప 'అమానవీయం' అని పిలుచుకునే గుణాలను అధిగమించి బతకలేదనేది గత చరిత్రకు మాత్రమే సంబంధించిన వాస్తవం కాదనీ, వర్తమాన సత్యం కూడాననీ, బహుశ మనిషికి సంబంధించిన సార్వజనీన సత్యమని గ్రహించి ఉండేవాళ్ళమేమో .